అక్కినేని ఫ్యామిలీలో సమంత చేరిపోయింది..!

0
959

akkineni family samantha

టాలీవుడ్ హాట్ కపుల్ నాగచైతన్య, సమంతల లవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సీక్రెట్ డేట్ కాస్త హాట్ న్యూస్ అయినా ఇద్దరు ఏమాత్రం నోరు విప్పింది లేదు. ఓ పక్క కింగ్ నాగార్జున కూడా ఇద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారే తప్ప మిగతా వివరాలేమి బయటకు రానివ్వట్లేదు. అయితే ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు వెడ్డింగ్ ఈవెంట్లో అక్కినేని ఫ్యామిలీ తరపున నాగచైతన్యతో పాటుగా సమంత కూడా పాల్గొంది. సో అఫిషియల్ గా చెప్పక పోయినా అక్కినేని ఫ్యామిలీలో సమంత చేరినట్టే అని అంటున్నారు కొందరు.

చైతు, సమంతల లవ్ గురించి ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతుంటారు. అసలు ఇంతకీ వీరు ఎప్పుడు నోరు తెరుస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక పెళ్లికి అటెండ్ అయిన సమంత కూడా తానో హీరోయిన్ గా కాకుండా చూడచక్కని కట్టు బొట్టుతో వచ్చింది. మరి వచ్చింది అక్కినేని కోడలిగానా లేక మళ్లీ అందరిని కన్ ఫ్యూజన్ లో పడేయడానికేనా అన్నది తెలియాల్సి ఉంది. ఈ గోలంతా దేనికి ఉంటే ఉందనో లేదంటే లేదు అనో చెప్పేస్తే పోలా.. ఓ పక్క లేదు లేదు అంటూనే సమంత అక్కినేని ఫ్యామిలీతో చేస్తున్న ఈ హడావిడి అందరిని ఆశ్చర్యంలో ముచెత్తుతుంది.

Leave a Reply