Posted [relativedate]
అక్కినేని మూడో తరం వారసుడు అక్కినేని ఫ్యామిలీలో స్టార్ హీరో అయ్యే లక్షణాలున్న నేటి తరం హీరో అఖిల్ ఒక సినిమా అయ్యిందో లేదో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అఖిల్ శ్రీయా భూపాల్ ల మ్యారేజ్ జరుగబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ 9న ఎంగేజ్ మెంట్ ప్లాన్ చేసిన నాగార్జున ఈ ఈవెంట్ కు కేవలం కొంతమంది గెస్ట్ ఇంకా కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చేలా ప్లాన్ చేశాడట. అదేంటి ఫ్యాన్స్ కు ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం లేదా అంటే లేదని తెలుస్తుంది. ఇక పెళ్లికైనా ఫ్యాన్స్ కు ఇన్విటేషన్ ఉందా అంటే అది లేదు అసలు పెళ్లి ఇక్కడ కాదు కూడా.. అదేంటి అఖిల్ మ్యారేజ్ ఇలా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది అంటే.. ఫ్యాన్స్ కోసం ఆఫ్టర్ మ్యారేజ్ ఓ చిన్న ఈవెంట్ ప్లానింగ్ లో ఉన్నారట.
ఆ ఈవెంట్ లో ఫ్యాన్స్ కు అఖిల్ దంపతులను పరిచయ కార్యక్రమం ఉంటుందట. సో అలా నాగ్ తన పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడన్నమాట. ఎంగేజ్ మెంట్, మ్యారేజ్ వీటిల్లో ఫ్యాన్స్ ఇన్వాల్వ్ మెంట్ లేకున్నా ఆ తర్వాత జరిగే ఈవెంట్ అంతా ఫ్యాన్స్ కోసమే అంటున్నారు. ఇక అదే కాకుండా నాగ చైతన్య సమంతల మ్యారేజ్ మాత్రం కచ్చితంగా ఫ్యాన్స్ మధ్యలోనే చేసే అవకాశం ఉంటుందట. హిందు, క్రిస్టియన్ రెండు సాంప్రదాయాల ప్రకారం ఆ మ్యారేజ్ లు జరుగుతాయి కనుక ఆ ప్రోగ్రాం లో మాత్రం ఫ్యాన్స్ కు అడ్డు చెప్పడట. తనయుల మ్యారేజ్ విషయంలో నాగార్జున ప్లాన్నింగ్ తో ఫుల్ ఖుషిగా ఉన్నారు ఫ్యాన్స్.