అక్కినేనివారి పసుపు వేడుక ఎప్పుడు?

   Posted December 24, 2016

akkineni wedding season start
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ 9న గ్రాండ్ గా జరిగింది. జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక పెళ్లి బాజాలే తరువాయి. పెళ్ళెప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. శ్రియా భూపాల్ ఫ్యామిలీ మాత్రం పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించేశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

శ్రియా భూపాల్‌తో సహా మిగిలిన మహిళలంతా పసుపు రంగు దుస్తులు ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. కాబోయే అక్కినేని కోడలు శ్రియ లెహంగాతో ఆకట్టుకున్నారు. వెనక బ్యాక్ గ్రౌండ్ మొత్తం పసుపు కలర్ లోనే ఉంది. ఇంటిని కూడా పసుపు పచ్చని బంతిపూలతో చక్కగా అలంకరించారు. ముఖ్యంగా ఈ పసుపు కొట్టే వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, చెర్రీ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు.

శ్రియా భూపాల్ ఫ్యామిలీలో ఎల్లో సెలబ్రేషన్స్ మొదలైపోవడంతో.. ఇక అక్కినేని వారింట ఎప్పుడు ఈ వేడుక మొదలవుతుందా అన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే అది జరగొచ్చని సమాచారం. అయితే ఈ వేడుకలో సమంత కూడా పాల్గొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సమంత వస్తే ఈ ఎల్లో సెలబ్రేషన్స్ మరింత కలర్ ఫుల్ గా కనిపించే అవకాశముంది. అక్కినేని ఫ్యాన్స్ అంతా దీని కోసం కళ్లప్పగించి మరీ వెయిట్ చేస్తున్నారు.

SHARE