బాలీవుడ్ : అతనితో ఇద్దరు పిల్లల్ని కూడా కంటా !

 Posted October 27, 2016

alia bhatt wants to make babies with sidharth malhotraబాలీవుడ్ లో గాసిప్ ల గోల ఎక్కువన్న విషయం తెలిసిందే. ఈరోజు కలసి తిరిగిన జంటపై.. రేపు బ్రేకప్ అంటూ కామెంట్ వినిపిస్తాయి. ఈ మధ్య అలియా భట్ -సిద్ధార్ద్ జంటపై కూడా ఈ రకమైన పుకార్లే షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే అలియాతో లవ్ ఎఫైర్ ని ఒప్పేసుకొన్నాడు సిద్ధార్థ్. కొన్నాళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు.

అయితే, ఆ తర్వాత రెండ్రోజులకే బ్రేకప్ అంటూ సంకేతాలించింది ఈ జంట. ఇదే విషయాన్ని..ఓ మీడీయా ప్రతినిథి అలియాని అడిగితే..కస్సుమంది.సిద్ధార్థ్ అంటే నాకు పిచ్చి. అతనితో ఇద్దరు పిల్లల్ని కూడా కంటాను..నీకేమైనా ప్రాబ్లమా అంటూ చిర్రుబొర్రులాడిందట. అరె.. ఇష్టం ఉంటే.. సాదాసీదాగా చెప్పాలే గానీ.. గిదేందనీ సదరు విలేకరి మనసులో అనుకుంటూ.. అక్కడి నుంచి నిష్ర్కమించాడట.

ఇక, అలియా నటించిన ”డియర్ జిందగీ” చిత్రం నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

SHARE