నాస్తికులైనా రామాయణాన్ని ఒప్పుకోవాల్సిందే..

 Posted October 25, 2016

    all people believe ramayana true story like same as doing mulayam singh family
రామాయణం పుక్కిటి పురాణమని నాస్తికులు,హేతువాదులు ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నారు.ఆస్తికులు అయ్యో రామ అని ఆ విమర్శలకి బాధపడిపోతుంటారు. రామాయణం నిజంగా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఓ విషయాన్ని మాత్రం నాస్తికులైన ఒప్పుకోవాల్సిందే.అదేమిటంటే ఊహాశక్తితో తానున్న కాలం నుంచి వేల సంవత్సరాలు ముందుకు ప్రయాణించిన రచయిత రాసిన ఓ ఘట్టం నేటికీ పచ్చి నిజమై కళ్ళముందు నిలుస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేడు మనం చూస్తున్న ఉత్తరప్రదేశ్ పరిణామాలు.

అప్పుడు కైక కొడుకైన భరతుడి కోసం రాముడిని అడవుల పాలుజేయాలని దశరథుడి మీద ఒత్తిడి తెచ్చింది.ఇప్పుడు యూపీ లో సవతితల్లి సాధన గుప్త యాదవ్ సొంత కొడుకు కోసం అఖిలేష్ ని బలిచ్చేలా ములాయం మీద ఒత్తిడి తెస్తోంది.ఇలా సవతి తల్లి ప్రవర్తించడం కొత్తేమీకాదని అందరికీ తెలుసు.కానీ ఆ విషయాన్ని రామాయణ రచయిత వాల్మీకి ఎన్నివేల ఏళ్ల కిందట ఊహించడం …ఆ సవతి తల్లి ఇప్పటికీ అలాగే ప్రవర్తించడం చూస్తున్నాం..కాలం వేగాన్ని, మార్పుల త్వరణాన్ని తట్టుకుని ఓ ప్రతికూల భావోద్వేగం ఇన్ని వేల ఏళ్ళు నిలబడుతుందని ఊహించడం ఎంత కష్టం.కానీ ఆ రచయిత భవిష్యత్ దృక్కోణం ఎంత గొప్పగా వుంది.అయితే కొందరికి ఓ డౌట్ రావచ్చు.ఆ రామాయణం లో దశరథుడి మాట రాముడు విన్నాడు..మరిప్పుడు అఖిలేష్ వినడంలేదుగా అనొచ్చు..నిజమే ..ఇది వాస్తవం..వాల్మీకి జరిగేది ఉహించాడు.అందుకే దానికి విరుగుడుగా ఆదర్శంగా ఎలా ఉండాలో చెప్పేందుకు రాముడిని ముందుంచాడు. రోగమే కాదు దానికి ముందుందని చెప్పటమే అయన ఉద్దేశం కావొచ్చు.నిజానిజాల వాదన పక్కన పెట్టి వాల్మీకి సృజనకు,భవిష్యత్ దర్శనానికి ఆధునిక యూపీ రామాయణం చూసాకైనా నాస్తికులు సలాం కొట్టాల్సిందే .

SHARE