ఒక్క దెబ్బకు రెండు పిట్టలు – 2018

0
457
all state assemblys and lok sabha elections at a time

Posted [relativedate]

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు.. తెలిసిందేగా 2019లో అంటారా. కాదు అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఆఖర్లోనే ఎన్నికలు వస్తాయి. పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కేసీఆర్, చంద్రబాబు సహా పదహారు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారట. ఇక ప్రతిపక్ష, ఎన్డీయే యేతర సీఎంలతో కూడా చర్చించాలని మోడీ భావిస్తున్నారు.

2018 ఆఖరులో లోక్‌సభతోపాటు అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది మోదీ ఆలోచన. ఇలా చేయాలంటే… కొన్ని రాష్ట్రాల అధికార కాలాన్ని పొడిగించాలి. మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని కుదించాలి. ఆరునెలల్లోపు పరిమితి ముగిసే రాష్ట్రాలతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కోవలోకి… ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిసా, సిక్కిం వస్తాయి. ఈ రాష్ట్రాలకు 2019 ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలకు 2018 ఆఖరులో లోక్‌సభతో కలిపి ఎన్నికలు జరగడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

సుమారు 17 రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి 2018 ఆఖరుకు కాస్త అటూ ఇటుగా ముగుస్తోంది. 2018 ఆఖరునాటికి రెండేళ్లకంటే తక్కువ కాలపరిమితి ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలన్నింటినీ ‘జమిలి’లో చేర్చేస్తారు. రెండేళ్లకంటే ఎక్కువ పదవీకాలం ఉన్న రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని 2023 వరకు పొడిగిస్తారు. వెరసి… 2023లో పూర్తిస్థాయిలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న మాట! ఈ లెక్క ప్రకారం… గుజరాత, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర, రాజస్థాన్‌, ఏపీ, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, హరియాణా, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిసా, సిక్కిం, ఢిల్లీ, బిహార్‌ రాష్ట్రాలకు 2018లో జమిలి ఎన్నికలు జరుగుతాయి.

Leave a Reply