నోట్ల రద్దు తొలి ఫలితం వచ్చేసింది..

0
572

Posted [relativedate]
+ కశ్మీర్‌ అల్లర్లకు చెక్‌
+ వారం రోజులుగా ప్రశాంత వాతావరణం

kashmir-violence
నోట్ల రద్దుతో ఇటు నల్ల కుబేరులనే కాకుండా ఉగ్రవాదంపైనా దెబ్బపడుతుందని ప్రధాని మోదీ చెబుతున్నా ప్రతిపక్షాల తలకు ఎక్కలేదు.. ఇప్పుడు తాజా పరిణామాలు గమనిస్తే ఆయన ప్లాన్‌ వర్కవుట్‌ అయినట్లే కనిపిస్తుంది.. నిత్యం రావణకాష్ఠంలా ఉంటే కశ్మీర్‌ వారం రోజులుగా చాలా ప్రశాంతంగా ఉంది. యువకులకు గొడవ చేసినందుకే డబ్బులు ముట్టజెప్పే ఉగ్రమూకలకు డబ్బులు లేకపోవడంతో అల్లర్లకు చెక్‌ చెప్పినట్లైయ్యింది. వారంలో ఒక్క రాయి కూడా విసరలేదంటే ఏ స్థాయిలో పాచిక పారిందో అర్థం చేసుకోవచ్చు.. కశ్మీరీ యువతను ప్రోత్సహించి, వారికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చే సంస్థలకు ఇప్పుడు దిక్కుతోచడంలేదు. ఇంకా చెప్పాలంటే, భారత్‌లోకి చొప్పించడానికి ఉగ్రవాదులు రూ.3000 కోట్ల నకిలీ కరెన్సీని సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. ఇప్పుడు అదంతా ఎందుకూ పనికిరాకుండా పోవడంతో మొత్తం సొమ్ము నష్టపోయారు.

kashmirnormalcy
                   పాకిస్థాన్‌లో తయారు చేసే ప్రతి నకిలీ నోటుపైనా 30-40 శాతం లాభం ఐఎస్‌ఐకి వస్తోందని నిఘా సంస్థలు అంచనా వేశాయి. అంతేనా.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఉగ్రవాద కార్యకలాపాలూ తగ్గాయి. కశ్మీరీ యువతకు పాక్‌ ఉగ్రవాద సంస్థలు ఇచ్చేది ఇండియన్‌ కరెన్సీయే. పెద్ద నోట్లనే వారికి ఇస్తారు. ఇప్పుడు అవి చెల్లకపోవడంతో ఉగ్రవాద కార్యకలాపాలకూ ఎదురు దెబ్బ తగిలింది. మరోవైపు పాఠశాలలను తగలబెట్టి అక్కడి విద్యార్థులకు చదువును దూరం చేసే చర్యలుసైతం ముమ్మరంగా జరిగేవి.. ప్రస్తుతం వాటికి చెక్‌ పడింది. తాజాగా 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని, వాటికి 95 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.. దీన్ని బట్టే అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడటానికి చక్కటి మందుగా పనిచేసిందని చెప్పొచ్చొ… ఇటువంటి ఘటనలు చూసిన వారెవరైనా ప్రతిపక్షాల గగ్గొలను సైతం లెక్కచేయడంలేదు.. పైగా కందకు లేని దురద కత్తిపీఠకు ఎందకంటూ సోషల్‌ మీడియాలో చురకలు కూడా వేస్తున్నారు..

Leave a Reply