24 గంటల్లోనే ఆ ఎమ్మెల్యేకి బాబు స్ట్రోక్ ..

  alla rama krishna reddy strocked by chandrababu
ఓటుకునోటు కేసును తిరగదోడేలా ఏసీబీ కోర్టుని ఆశ్రయించిన మంగళగిరి ఎమ్మెల్యేకి ఏపీ సీఎం దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.24 గంటలైనా గడవక ముందే ఆళ్ళరామకృష్ణా రెడ్డి కి వ్యతిరేకంగా ఎన్నికల సంఘం ఎదుట ఫిర్యాదు నమోదైంది.ఆ ఫిర్యాదు చేసింది న్యాయవాది మాగులూరి హరిబాబు.ఆస్తులకి సంబంధించి ఎన్నికల అఫిడవిట్ లో ఆళ్ళ తప్పుడు సమాచారమిచ్చారని హరిబాబు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

రామకృష్ణారెడ్డికి గుంటూరు,నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయనకి ఎన్నో అక్రమాస్తులున్నాయని హరిబాబు ఆరోపించారు.తప్పుడు అఫడవిట్ ఇచ్చిన ఆళ్ళ ని ఎమ్మెల్యేగా తప్పించాలని హరిబాబు ఈసీ ని కోరారు.హఠాత్తుగా ఈ ఫిర్యాదు రావడం వెనుక సీఎం చంద్రబాబు వున్నారని ఆళ్ళ వర్గీయులు ఆరోపిస్తున్నారు.సరే …ఆళ్ళ ఏసీబీ కోర్టుకి వెళ్లడం వెనుక జగన్ ఉన్నాడని దేశం వర్గాల వాదన.చర్యకి సమానమైన ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ మూడో సూత్రం భౌతిక శాస్త్రానికి మాత్రమే కాదు.రాజకీయాల్లోనూ వర్తిస్తుందని ఆళ్ళకి 24 గంటల్లోనే రుజువుచేసి చూపించినట్టుంది.

SHARE