ఏపీ ముఖ్యమంత్రి పై వున్న ఓటుకునోటు కేసు తిరగతోడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తనను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు లేఖపై పోలీసుల్ని ఆశ్రయించారు.ఈ కేసులో హై కోర్ట్ స్టే ఇచ్చినప్పటికీ అయన సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లే అవకాశాల్ని దృష్టిలో ఉంచుకొనే ఈ బెదిరింపులు చేసినట్టు rk ఆరోపిస్తున్నారు . ఓటుకునోటు కేసులో సుప్రీమ్ కోర్ట్ కి వెళితే మంగళగిరి లోనే చంపుతామని ఆ లేఖలో హెచ్చరించారు .కొంత అసభ్యపద జాలం కూడా వినియోగించారు .లేఖ రాసిన వారిని కనుక్కొని కఠినంగా శిక్షించాలని rk డిమాండ్ చేశారు .