జగన్ కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వబోతున్న టీడీపీ..

Posted October 8, 2016

 alla ramakrishna reddy said chandrababu number one corruption man tdp counter jagan
ఆర్కే గా అభిమానులు పిలుచుకునే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకునోటు కేసులో కోర్టు మెట్ట్లెక్కి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఓ సాదాసీదా ప్రెస్ మీట్ తో సొంత పార్టీ అధినేతని ప్రత్యర్ధులు టార్గెట్ చేసేలా చేస్తున్నాడు.కేఎల్ యూనివర్సిటీ లో జరిగిన టీడీపీ శిక్షణా శిబిరాన్ని ఉద్దేశించి అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై ర్యాంకులు ప్రకటిస్తే బాగుండేదని ఆర్కే వ్యాఖ్యానించాడు.పైగా ఆ ర్యాంకుల్లో ప్రధమ స్థానం బాబుదేనని..ఆ తరువాత స్థానాల కోసమే పోటీ అని అయన ఆరోపించారు.ఈ విషయం తెలియగానే దేశం శ్రేణులు అలెర్ట్ అయిపోయాయి.ఓటుకునోటు కేసులో బాబుకి ఇబ్బంది కలిగినప్పటినుంచి ఆర్కే మీద దేశం వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి.

ఆర్కే తాజా ఆరోపణల్ని అడ్డం పెట్టుకుని జగన్ అవినీతి మహాభారతాన్ని పర్వాలుపర్వాలుగా మళ్లీ జనానికి గుర్తు చేసేందుకు దేశం నాయకులు పోటీలు పడుతున్నారు.జగన్ కి అవినీతిలో ఫస్ట్ రాంక్ ఇచ్చి మిగిలిన వైసీపీ నేతలకి తర్వాతి ర్యాంకులు ప్రకటించడానికి జాబితా సిద్ధం చేస్తున్నారు.ఇదంతా చూసి ఆర్కే దూకుడుకి కాస్త పగ్గాలు వేయాల్సిందేనని వైసీపీ లో కొందరు ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.అవినీతి టాపిక్ వస్తే మన గోతి మనం తవ్వుకున్నట్టేనని వారి ఆలోచన.అందుకే బాబు వాగ్ధానభంగాలపై ఎక్కువగా జనం దృష్టిని మళ్లించాలని చూస్తుంటే ఇప్పుడు ఆర్కే ఇలా చేస్తున్నాడనివాళ్ళు విసుక్కుంటున్నారు.ఆర్కే గారూ దేశం కౌంటర్లు మాటేమోగానీ వైసీపీ నేతల మాటన్నా కాస్త పట్టించుకోండి సార్ .

SHARE