మహేష్ బాబు మూవీ లో అల్లరి నరేష్…!

0
613
allari naresh in mahesh vamshi paidipalli movie

Posted [relativedate]
allari naresh in mahesh vamshi paidipalli movie
మహేష్ బాబు వరుసగా తన సినిమాలను లైన్ లో పెట్టేశాడు. మరో రెండేళ్ల వరకూ మహేష్ సినిమాలతో చాలా బిజీ బిజీగా ఉండబోతున్నాడు.. ప్రస్తుతం మురుగదాస్ తో తెరకెక్కిస్తున్న హై బడ్జెట్ బై లింగ్యువల్ మూవీ లో నటిస్తున్న మహేష్ , ఈ సినిమా పూర్తి కాకముందే తన తదుపరి చిత్రాల పై ఫోకస్ పెట్టాడు.మే నెల నుంచి కొరటాల శివతో ‘భరత్ అను నేను’ పేరుతో కొత్త సినిమా మొదలు పెట్టేయనున్నాడు మహేష్.ఆ తర్వాత వంశీ పైడిపల్లితో మూవీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఈ సూపర్ స్టార్.

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో ఒక ఆసక్తి విషయం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే టాలీవుడ్ లో కామెడీ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న నటుడు అల్లరి నరేష్. ఇటీవల వంశీ పైడిపల్లి మహేష్ మూవీ లో ఒక ప్రధాన పాత్ర కోసం, ఈ పాత్రకు సంబంధించిన డీటైల్స్ తో అల్లరి నరేష్ ను కలిశాడట వంశీ. అల్లరి నరేష్ కూడా స్టొరీ బాగా నచ్చడంతో ఈ పాత్రకు ఓకే చెప్పాడంటా.. ఇదే విషయాన్ని వంశీ పైడిపల్లి మహేష్ కి కూడా ఇప్పటికే చెప్పినట్లు టాక్. మహేష్ కూడా ఈ విషయానికి చాలా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కాంబినేషన్ కుదురుతుందో లేదో.. ఫైనల్ అవుతుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం.

ఎందుకంటే.. ఈ ప్రాజక్టు ప్రారంభమయ్యేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని.. మురుగదాస్ , కొరటాల శివ సినిమాలు ఫినిష్ అయ్యేసరికి కనీసం ఏడెనిమిది నెలలు పట్టే అవకాశం ఉంది.. అయితే.. ఇంత తొందరగా అల్లరి నరేష్ కలిసి మూవీ గురించి చెప్పటానికి కారణం ,అల్లరి నరేష్ ఒప్పుకుంటే.. ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండేలా ఫైనల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే ఇంత ముందుగా ఆ కామెడీ హీరోను దర్శకుడు సంప్రదించాడని అంటున్నారు.

Leave a Reply