అల్లరోడి పంబలకిడిజంబ..!

Posted December 13, 2016

Allari Naresh Pam Lakidi Jampa Tollywood Moviesఈ.వి.వి సూపర్ హిట్ మూవీస్ లో జంబలకిడిపంబ ఒకటి. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు అప్పటిదాకా ఉన్న టాలీవుడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అంతా ఆ సినిమాలో నటించడమే కాకుండా విచిత్రమైన కామెడీతో కడుపుబ్బా నవ్వించేలా చేశారు. అయితే ఆ మహా దర్శకుడి తనయుడిగా మొదట అలాంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన అల్లరి నరేష్ ఇప్పుడు హిట్ కోసం తపించిపోతున్నాడు. అందుకే ఈవివి హిట్ సినిమా జంబ లకిడి పంబను సీక్వల్ గా పంబ లకిడి జంబ అని చేయబోతున్నారట.

ఈమధ్యనే ఈ సినిమాకు సంబందించిన కథ సిద్ధం చేయించారట. కథ కూడా జంబలకిడిపంబకు ఏమాత్రం తగ్గకుండా సిద్ధం చేశారట. ఈ సినిమాతో మళ్లీ అల్లరోడు హిట్ ట్రాక్ ఎక్కేయడం ఖాయం అనేస్తున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నెల 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేయగా బడా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.

SHARE