దువ్వాడలో అల్లు అరవింద్‌ వేలు.. అందుకే ఆలస్యం??

Posted April 13, 2017

allu aravind making dj reshoot
మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘డీజే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దిల్‌రాజు బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా అవ్వడంతో సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. పైగా అల్లు అర్జున్‌ వరుస సక్సెస్‌ చిత్రాల తర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ అశ్రద్ద చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో సూపర్‌ హిట్‌ సాధించేలా హరీశ్‌ శంకర్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. వచ్చే నెలలో విడుదలవ్వాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసిన విషయం తెల్సిందే. వాయిదాకు కారణం ఏంటి అనేది అధికారికంగా వెళ్లడి కాలేదు. అయితే సినీ వర్గాల్లో వనిపిస్తున్న గుసగుసల మేరకు ఇటీవలే ‘డీజే’ చిత్రం కొన్ని సీన్స్‌ రషెష్‌ను చూసిన అల్లు అరవింద్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడట.

ముఖ్యంగా కొన్ని సీన్స్‌ను పూర్తిగా తీసేయాల్సిందే అంటూ అల్లు అరవింద్‌ సలహా ఇవ్వడంతో దిల్‌రాజు బడ్జెట్‌ పెరిగినా పర్వాలేదని మళ్లీ ఆ సీన్స్‌ను రీ షూట్‌ చేయించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ రీషూట్‌ కారణంగా బడ్జెట్‌ అయిదు నుండి ఏడు కోట్లు పెరిగే అవకాశాలున్నాయని అనధికారిక సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ చిత్రం 70 నుండి 75 కోట్ల వరకు అయ్యేలా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా బన్నీకి జోడీగా నటిస్తుంది. అల్లు అర్జున్‌ అయ్యగారిగా కనిపించిన పోస్టర్స్‌ మరియు టీజర్‌ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో దుమ్ము రేపిన విషయం తెల్సిందే.

SHARE