అల్లు వారి ఎత్తుగడ ఫలిస్తుందా..?

Posted March 19, 2017

allu aravind plan for sireeshటాలీవుడ్ లో అల్లు వారి బ్రాండ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వీళ్లు తీసిన  సినిమాలు కొన్ని యావరేజ్ అయినా మిగిలినవన్నీ  హిట్స్ అనే చెప్పుకోవాలి.  ఈ గీతా ఆర్ట్స్ బ్యానర్ ని అల్లు రామలింగయ్య స్ధాపించినా ఆయన తనయుడు అల్లు అరవింద్ దాన్ని సమర్ధవంతంగా నడుపుతున్నాడు. అల్లు అరవింద్.. ఈ నిర్మాత బ్రెయిన్ మాస్టర్ బ్రెయిన్ అని ఒప్పుకోవాలి. ఎందుకంటే తన బావ చిరంజీవితో ఎన్నో కమర్షియల్ హిట్స్ కొట్టిన అల్లు అరవింద్..  ఇప్పుడు ఆ ఇమేజ్ ని ఉపయోగించుకుని తన కొడుకు బన్నీని  మాస్ హీరోగా  నిలబెట్టాడు. మెగా ఫ్యామిలీ హీరో అంటూ చిరు ఇమేజ్ తో బన్నీకి  మెగా కెరీర్ ని ఏర్పాటు చేసేశాడు.

తాజాగా తన చిన్న కొడుకు అల్లు శిరీష్ ని కూడా టాప్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం  చేస్తున్నాడు. గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ ఏ మాత్రం హీరో ఇమేజ్ ని దక్కించుకోలేకపోయాడు అనేది వాస్తవం. ఆ తర్వాత కొత్తజంటగా వచ్చినా ఉపయోగం లేకపోయింది. మూడో సినిమా శ్రీరస్తు.. శుభమస్తు సినిమాతో కాస్త ఓకే అనిపించుకున్నాడు. మాస్ హీరో పర్సనాలిటీ శిరీష్ కి లేకపోవడంతో  వైవిధ్య కధాంశాల  ద్వారా స్టార్ హీరో ఇమేజ్ ని ఏర్పాటు చేసే పనిలో పడ్డాడట అరవింద్. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి ఇన్నోవేటివ్ సినిమాతో హిట్ కొట్టిన ఐ. వి. ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు అరవింద్. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కబోయే ఆ సినిమాలో సీరత్ కపూర్, సురభి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి అల్లు వారి కొత్త స్రేటజీ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

SHARE