శర్వానంద్ తో అల్లు అరవింద్

Posted November 14, 2016

Allu Aravind Planning A Movie With Sharwanandగీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఒకప్పటిలా కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా మినిమం బడ్జెట్ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో చేసిన నాని భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ అవడంతో ఇక ఆ దారిలోనే మళ్లీ సినిమాలు చేయాలని చూస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 అని బ్యానర్ పేరు వేసినా బన్ని వాసు నిర్మాత అని అంటున్నా మొత్తం నడిపించేది అల్లు అరవిందే అని అందరికి తెలుసు. రీసెంట్ గా శ్రీరస్తు శుభమస్తు అని అల్లు శిరీష్ కు హిట్ అందించిన పరశురాం మరోసారి గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ ను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. తన మార్క్ సెపరేట్ స్టైలిష్ సినిమాలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్న శర్వానంద్ దిల్ రాజుతో శతమానం భవతి అని ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్న దిల్ రాజు సినిమా హిట్ అనేస్తున్నారు. ఇక ఈ క్రమంలో అల్లు అరవింద్ సినిమా కూడా ఒకే అయితే శర్వాకు తిరుగుండదని చెప్పాలి.

ప్రస్తుతం పరశురాంతో కథా చర్చలు నడుస్తున్నాయట. అంతా ఓకే అనుకుంటే శర్వానంద్ తో గీతా ఆర్ట్స్ సినిమా ఖాయమైనట్టే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ తర్వాత అల్లు అరవింద్ నిర్మించే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు.

SHARE