Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ సాధిస్తున్న కలెక్షన్స్ చూస్తే ఏ ఒక్కరికైనా మంచి కంటెంట్ ఉంటే ఎంత బడ్జెట్ అయినా పెట్టవచ్చు. సినిమా బాగుంటే ఎంత బడ్జెట్ అయినా రికవరీ అనేది సాధ్యమే అంటూ తేలిపోయింది. దాంతో భారీ బడ్జెట్‌తో సినిమాలకు ప్రముఖులు సైతం సిద్దం అవుతున్నారు. కొన్నాళ్లుగా మూలన పడిపోయిన పౌరాణిక చిత్రాలు మళ్లీ బాహుబలి కారణంగా ముందుకు రాబోతున్నాయి. మహాభారతం సినిమాను బాలీవుడ్లో వెయ్యి కోట్లతో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. 2020లో మహాభారతం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సమయంలోనే రామాయణం కూడా రాబోతుంది.
తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి ‘రామాయణం’ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో ఇంకా పలువురు పాలు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్ ఇదే సంవత్సరం పట్టాలెక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘బాహుబలి 2’ తరహాలోనే ఈ సినిమాను రెండు లేదా మూడు పార్ట్‌లుగా విడుదల చేసే అవకాశాలున్నాయి. 3డి టెక్నాలజీతో ఈ సినిమాను రూపొందించనున్నారు. అల్లు అరవింద్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.