Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి 2’ సినిమా తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ముందుకు వస్తున్నారు. అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతతో కలిసి 500 కోట్లతో ‘రామాయణం’ చిత్రాన్ని 3డిలో రూపొందించేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా సినిమా గురించి పలు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. రాముడిగా రామ్చరణ్, రావణుడిగా రానా అంటూ సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం పూర్తి బాలీవుడ్ నటీనటులతోనే ‘రామాయణం’ తెరకెక్కబోతుందని అంటున్నారు.
అల్లు అరవింద్ ఈ సినిమాకు నిర్మాత కనుక ఖచ్చితంగా మెగా హీరో ముఖ్య పాత్రలో అయినా కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. తన కుటుంబ హీరోలను వదిలేసి, అంత పెద్ద ప్రతిష్టాత్మక సినిమాను అల్లు అరవింద్ చేసేందుకు మూర్ఖుడేమీ కాదని కొందరు అంటున్నారు. అల్లు అర్జున్ లేదా రామ్చరణ్లలో ఎవరినో ఒకరిని లేదా మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు ముగ్గురిని కూడా ‘రామాయణం’లో అల్లు అరవింద్ చూపించే ప్రయత్నం చేస్తాడు. తెలుగు నుండి ఖచ్చితంగా ముఖ్య పాత్రలకు నటులను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ పాత్రలకు మెగా హీరోలనే తీసుకోవడం వల్ల తమ ఫ్యామిలీ హీరోలకు గుర్తింపు రావడంతో పాటు పారితోషికం విషయంలో కూడా కలిసి వస్తుందని అల్లు అరవింద్ భావించే అవకాశాలున్నాయి. అందుకే ‘రామాయణం’లో ఖచ్చితంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాత్రల్లో మెగా హీరోలు కనిపించడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు.