అఫిషియల్ గా బన్నీ కొత్త మూవీ…డిఫరెంట్ కాంబో

0
465
allu arjun and vakkantham vamsi naa peru surya naa illu india movie official announcement

Posted [relativedate]

allu arjun and vakkantham vamsi naa peru surya naa illu india movie official announcementస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు.ఇన్నాళ్లు పెండింగ్ లో పెట్టిన ఓ వెరైటీ ప్రాజెక్ట్ ని అఫిషియల్ గా ఓకే చెప్పేసాడు. ఎన్టీఆర్ క్యాంపు నుంచి వచ్చిన వక్కంతం వంశీ కి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తూ కొత్త సినిమాకి శ్రీకారం చుడుతున్నాడు.ఇదొక్కటే కాదు ఈ సినిమా నిర్మాతలు కూడా ఓ డిఫరెంట్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి.లగడపాటి శ్రీధర్ కి చెందిన రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్న ఈ సినిమా నిర్మాణంలో అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు ఇంకో నిర్మాత.మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రానికి సమర్పకుడు.ఇలా డిఫరెంట్ పీపుల్ ని ఒక్క చోటికి చేర్చి కొత్త సినిమా సెట్ చేసాడు బన్నీ .ఆయన బర్త్ డే సందర్భంగా ఆ సినిమా వివరాలు బయటికి వచ్చేలా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ ఓ ప్రకటన ఇచ్చింది.

ఇక ఈ సినిమా బన్నీ కెరీర్ లో 18 వ సినిమా .దీని పేరు ‘ నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా ‘ అని ప్రచారంలో వుంది.మంచి అభిరుచి,సినిమా అంటే తపన వున్న వారంతా ఈ సినిమా కోసం పని చేయడం విశేషం.ఆల్ ది బెస్ట్ బన్నీ …హ్యాపీ బర్త్ డే టు యు

Leave a Reply