Posted [relativedate]
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గతేడాది సరైనోడు సినిమాతో భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా డీజే.. దువ్వాడజగన్నాధమ్. మాస్ కమర్షియల్ సినిమాల స్సెషలిస్ట్ హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లను విడుదల చేసి చిత్రయూనిట్ హైప్ క్రియేట్ చేసింది.
విడుదలైన బన్నీ లుక్స్, పోస్టర్స్, ట్రైలర్స్ తో బన్నీ ఓ బాహ్మణ యువకుడని తెలుస్తోంది. అలానే ట్రైలర్ లో బన్నీ మాట్లాడిన విధానంతో ఈ సినిమా అదుర్స్ సినిమా నుండి కాపీ చేశారని అందరూ భావించారు. అదుర్స్ లో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేస్తే, డీజేలో బన్నీ సింగిల్ రోల్ తో కధ నడిపించేశాడని అన్నారు. అదుర్స్ కి, డీజేకి అదొక్కటే తేడా అని అనుకున్నారు. అయితే డీజే కాపీ కొట్టింది అదుర్స్ సినిమా నుండి కాదని, అర్జున్ నటించిన జెంటిల్ మన్ సినిమా నుండి అని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్ సినిమాలో కూడా అర్జున్ బాహ్మణ యువకుడి పాత్రను పోషించాడు. జనాలను మోసం చేసే పెద్దపెద్దవారిని కొట్టి పేదలకు పెట్టడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎంతో అమాయకంగా అప్పడాల కంపెనీ నడిపే అర్జున్ .. అయిన వారికి తెలియకుండా, పోలీసులకు దొరక్కుండా దొంగతనాలు చేస్తుంటాడు. ఆ డబ్బుతో పేద విద్యార్ధులకు ఉచితంగా చదువుకోడానికి విద్యాలయాన్ని నిర్మిస్తాడు. డీజేలో కూడా బన్నీ ఇంచుమించుగా అలానే చేస్తుంటాడని ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ కాపీ పేస్ట్ సినిమాతో బన్నీ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.