తిక్క కుదిరిందా ?

 allu arjun fans fair thikka sai dharam tej

మెగా ఫ్యామిలీలో అంతా బాగానే ఉన్నా.. అభిమానుల మధ్య విభేదాలు మరింత రాజుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ కు – పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య వివాదం కాస్త సద్దుమణిగిందని అనుకున్నారంతా. అయితే ‘తిక్క’ ఆడియోలో సాయిధరమ్ తేజ్ చేసిన ‘చెబుతాను బ్రదర్’ కామెంట్స్ మళ్లీ నిప్పురాజేసినట్టైంది. బన్నీకి తేజు ఇచ్చిన కౌంటర్ అతడి అభిమానులకు నచ్చలేదు. ఇలాంటి టైంలో ‘తిక్క’ రిలీజవడం.. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో వాళ్లకు మంచి అవకాశం దొరికినట్లయింది. నిన్న ఫస్ట్ డే ఫస్ట్ షో అవగానే.. సోషల్ మీడియాలో ‘తిక్క’ మీద సెటైర్లు మొదలయ్యాయి. ‘తిక్క కుదిరింది బ్రదర్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి సాయిధరమ్ ను ఆడుకునే పని ప్రారంభించారు బన్నీ ఫ్యాన్స్.

ఇంతకుముందు అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అన్నపుడు ఆ డైలాగ్.. హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ ‘చూస్కుంటాం బ్రదర్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి బన్నీ మీద సెటైర్లు కుమ్మారు. ఆ తర్వాత తేజు ‘చెబుతాను బ్రదర్’ హ్యాష్ ట్యాగ్ అయింది. లేటెస్ట్‌గా ‘తిక్క కుదిరింది బ్రదర్’ అంటూ సాయిధరమ్ గాలి తీసే పనిలో పడ్డారు బన్నీ అభిమానులు. తామంతా ఒకటే అని.. మెగా హీరోలు స్టేజీలెక్కి చెప్పినా ఫ్యాన్స్ మాత్రం అంతగా పట్టించుకోవడంలేదు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని.. సరదాగా ఉంటారని తెలసినా.. అభిమానులు మాత్రం ఆన్‌లైన్‌లో కుమ్ములాడుకోవడం విడ్డూరంగా ఉంది.

SHARE