అల్లు అర్జున్‌ మంచి నిర్ణయం!!

81

Posted [relativedate]

allu arjun good decision
‘సరైనోడు’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘డీజే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే మూడు వరుస విజయాలతో జోష్‌ మీదున్న అల్లు అర్జున్‌ ‘డీజే’తో నాల్గవ సక్సెస్‌ను కూడా దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. వరుస సక్సెస్‌లు వచ్చినప్పుడు ఏ హీరో అయినా ప్రయోగాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రయోగాత్మక చిత్రాలు చేసి నటుడిగా తానేంటో నిరూపించుకోవాలి. ఇప్పుడు బన్నీ అదే చేయబోతున్నాడు. కమర్షియల్‌ సక్సెస్‌ కోసం కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్‌ తన తర్వాత సినిమాను ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు.

రెగ్యులర్‌ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. దేశ భక్తి నేపథ్యంలో ఇప్పటికే వక్కంతం వంశీ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడని, కమర్షియల్‌ చిత్రంలా కాకుండా ఒక మంచి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి, అందులోనే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడిస్తే బాగుంటుందని వక్కంతం వంశీ భావిస్తున్నాడు. వరుస సక్సెస్‌లు ఉన్న నేపథ్యంలో బన్నీ ఈ దేశ భక్తి చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇప్పటికే ఈ దేశ భక్తి చిత్రానికి ‘నా పేరు సూర్య’(నా ఇల్లు ఇండియా) అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. బన్నీ ఈ సినిమాలో సైనికుడిగా కనిపించనున్నాడు. ఇలాంటి చిత్రాన్ని ఒప్పుకున్నందుకు బన్నీని నిజంగా అభినందించాల్సిందే. బన్నీకి ఈ సినిమా సక్సెస్‌ అయినా కాకున్నా కూడా కెరీర్‌లో నిలిచి పోయే సినిమా అవ్వడం మాత్రం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here