బన్నీ భలే అవార్డు కొట్టేశాడు..

 allu arjun got pravasa rathna puraskaram award star asia net midile east
ప్రవాసీ రత్న పురస్కారం…పేరుకి తగ్గట్టే ఈ అవార్డు ఇచ్చింది ఇక్కడవాళ్ళు కాదు …స్టార్ ఏషియా నెట్ మిడిల్ ఈస్ట్ విభాగానికి చెందిన 24 గంటల వినోదపు ఛానల్ ఈ పురస్కారాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రకటించింది.దీని వెనుక ఏముందని బుర్ర బద్దలు కొట్టుకునే పనిలేదు.

బన్నీకి కేరళ లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే..మలయాళీలు ఎక్కువగా వలసవెళ్లే గల్ఫ్,దాని సమీప దేశాల్లో సదరు ఛానల్ ప్రసారాలు చేస్తుంది.ఓనం పండగ సందర్భంగా స్టార్ ఏషియా నెట్ విదేశాల్లో వుండే మలయాళీలు కోసం దుబాయ్ లో ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది.మలయాళీలు మనసు దోచిన బన్నీ కి ప్రవాసీరత్న పురస్కారం ప్రకటించి ,అదే వేదికపై ఆయన్ను ఘనంగా సత్కరించాలని ఆ ఛానల్ ప్లాన్ చేస్తోంది .

SHARE