నాని డైరెక్షన్ లో బన్నీ??

 Posted March 25, 2017

allu arjun in nani directionగతంలో చాలా మంది నటీనటులు తాము డాక్టర్ అవుదామనుకుని  యాక్టర్ అయ్యామని చెప్పేవారు. అది నిజమో కాదో తెలియదు కానీ రవితేజ, నాని నిజంగా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. డెరెక్టర్లు కాబోయి యాక్టర్లుగా మారారు. స్టార్ హీరో రేంజ్ ని అందుకున్నారు. అయితే ఇటీవల కాస్త స్పీడు తగ్గించిన మాస్ మాహారాజా త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నట్లు తెలిపాడు. తాజాగా నాని కూడా ఇదే రూట్ లో నడుస్తున్నాడు.

శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసే రోజుల్లో నాని ఓ కధను రెడీ చేశాడట. అప్పుడే ఆ కధను బన్నీకి వినిపించేశాడట. బన్నీ కూడా కధ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే అదే సమయంలో నానికి హీరోగా అవకాశం రావడంతో యాక్టింగ్ వైపు మొగ్గుచూపాడట.  మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా ఆ తర్వాత డిఫరెంట్ కధలను ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకున్నాడు. అయినా సరే బన్నీ ఇప్పటికీ ఆ కధను చేద్దామని అడుగుతుంటాడట. నాని కూడా సమయం చూసి చేద్దామని చెబుతుండాటని సన్నిహితులు అంటున్నారు. మరి నేచురల్ స్టార్ గా మంచి హిట్స్ అందుకుంటున్న నాని నేచురల్ డైరెక్టర్ అన్న పేరు కూడా తెచ్చుకుంటాడేమో చూడాలి.

SHARE