బన్నీ ఆ  మూవీని ఆపేశాడా..?

0
613
allu arjun lingusamy movie cancel

Posted [relativedate]

allu arjun lingusamy movie cancelవరుస హిట్లతో రికార్డుల మోత మోగిస్తున్న బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో డీజే-దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్టాఫ్ లో కేటరింగ్ కుర్రాడిగా కనిపించినా సెకండాఫ్ మొత్తం ఫుల్ యాక్షన్ డోస్ ఉంటుందని, సెకండాఫ్ లో  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని  ఇప్పుడు సోషల్ మీడియాలో  హాట్ న్యూస్ గా చర్చించుకుంటున్నారు. కాగా ఈ సినిమా తర్వాత ఈ అల్లువారబ్బాయి వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్నట్లు రీసెంట్ గా ప్రకటించాడు.  ‘నా పేరు సూర్య…  నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కనుంది.

నిజానికి డీజే మూవీ తర్వాత బన్నీ తమిళ్ మాస్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా మూవీ చేయాల్సి ఉంది. అప్పట్లో  ఈ సినిమాకు  సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాను బన్నీ ఆపేశాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ సరిగా నచ్చకపోవడం, బిజినెస్ కి సంబంధించి ఏకాభిప్రాయం రాకపోవడం వంటి కారణాలతో బన్నీ సినిమాను కాన్సిల్ చేశాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. లింగుస్వామి  సినిమా ఆగిపోవడంతో వక్కంతం వంశీ సినిమాను ట్రాక్ ఎక్కించేస్తున్నాడట బన్నీ. కాగా ఓ సినిమాను ప్రారంభోత్సవం చేసి ఆపేయడం బన్నీ కెరీర్ లోనే ఇదే మొదటిసారని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

Leave a Reply