బన్నీ తో చాన్స్ కొట్టేసిన భామ..

0
806

  allu arjun new movie heroine pooja hegde

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ సరసన ‘ముకుంద’ ఫేమ్ పూజ హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ముకుందలో గోపికమ్మా… అంటూ వరుణ్ తో సాంగ్ ఏసుకున్న ఈ భామ ఇపుడు బన్నీతో జతకట్టనుంది.వరసగా మెగా ఆఫర్లు కొట్టేసింది.ముకుంద తరువాత బాలీవుడ్ చెక్కేసింది. హృత్తిక్ రోషన్ హీరోగా నటిస్తున్న మోహాంజెదరో సినిమాలో నటిస్తోంది.

బన్నీ,పూజ హెగ్డే నటించబోతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ తర్వాత చాలా కష్టపడి పక్క స్క్రిప్ట్ రెడీ చేసి ‘బన్నీ’ ని ఒప్పించినట్లు తెలుస్తుంది. గబ్బర్ సింగ్ బ్లాక్ బ్లాస్టర్ తో పైకి లేచాడు,ఆ తర్వాత ‘రామయ్య వస్తావయ్యా ‘ఇచ్చిన షాక్ కి కిందకెళ్ళాడు. మళ్ళీ ఇంక లేవలేడు అనుకున్న సమయంలో సుబ్రమణ్యం ఫర్ సేల్ తో ప్రూవ్ చేసుకున్నాడు హరీష్. ఇప్పుడు బన్నీ కి ఎలాంటి బ్రేక్ ఇస్తాడో చూడాలి.ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply