అల్లు అర్జున్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా ముఖ్య పాత్రలో కేథరిన్ తెర్సా నటించిన చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ సినిమా తాజాగా బాలీవుడ్‌కు వెళ్లింది. డబ్బింగ్ అయ్యి సోనీ మ్యాక్స్‌లో ప్రసారం అయ్యింది. హిందీ ఆడియన్స్‌కు ఆ సినిమా బాగా నచ్చినట్లుంది. టీవీలో ప్రసారం అయిన వెంటనే యూట్యూబ్‌లో సరైనోడును అప్లోడ్ చేయడం జరిగింది. హిందీ రైట్స్ తీసుకున్న వారు, తెలుగులో నిర్మించిన నిర్మాత అల్లు అరవింద్, నటించిన బన్నీ, దర్శకత్వం వహించిన బోయపాటి ఇలా అంతా కూడా షాక్ అవుతున్నారు.
యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా సాధించని వ్యూస్‌ను హిందీ సరైనోడు సాధించాడు. ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే 6.1 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ చిత్రాల టీజర్లు మరియు ట్రైలర్లు కూడా ఈ స్థాయిలో వ్యూస్‌ను దక్కించుకున్న దాఖలాలు లేవు. నాలుగు రోజుల్లో ఈ చిత్రం యూట్యూబ్‌లో 16 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని సరి కొత్త రికార్డులను సృష్టించింది. అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో యూట్యూబ్స్ ట్రెండ్స్‌లో టాప్‌లో నిలిచింది. ఏ ఇండియన్ సినిమాకు కాని టీజర్ లేదా ట్రైలర్‌కు కాని ఇంత భారీ ట్రెండ్స్ దక్కలేదు. ఇది ఎలా సాధ్యం అయ్యింది, ఇంతగా వ్యూస్ ఎందుకు వచ్చాయి అంటూ బాలీవుడ్ నిర్మాతలు మరియు ఫిల్మ్ మేకర్స్ కూడా షాక్ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన ‘ట్యూబ్‌లైట్’ చిత్రం ట్రైలర్‌ను కూడా క్రాస్ చేసి సరైనోడు దూసుకు పోతున్నాడు. బన్నీ గత చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా హిందీ వర్షన్ 30 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘సరైనోడు’ మొత్తంగా 50 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.