లింగుస్వామి చిత్రం కోసం బన్నీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ?

Posted October 4, 2016

  allu arjun remuneration lingusamy movie

లింగుస్వామి దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం బన్నీ భారీ రెమ్యూనరేషన్ ని అందుకోనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. అయితే, పూర్తిగా రెమ్యూనరేషన్ రూపంలో కాకుండా.. ఏదైనా ఓ ఏరియా పంపిణీ హ‌క్కుల‌ను బన్నీ తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. రెమ్యున‌రేష‌న్‌కు బ‌దులు ఓ ఏరియా పంపిణీ హ‌క్కుల‌ను తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడీ లిస్టులో స్టయిలీష్ స్టార్ కూడా చేరిపోయాడు.

ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డీజె.. దువ్వాడ జగన్నాథం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. వచ్చే యేడాది జనవరిలో లింగుస్వామి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా బన్నీ ప్లాన్ చేసినట్టు సమాచారమ్. ఈ లోపు లింగుస్వామి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయనున్నాడు. త్వరలోనే.. ఈ చిత్రం పూర్తి వివరాలు తెలియనున్నాయి.

SHARE