ఆ ఖాన్ బదులు ఈ ఖాన్..టేస్ట్ మారిందా బన్నీ ?

 allu arjun said my favourite hero salman khan vijay tamilఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది.

ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు చూస్తున్నారు. ఈ విషయంలో మన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా మినహాయింపు కాదు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ ను అభిమానించే బన్నీ.. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ను ఇష్టపడుతున్నాడట. నేను మొదట్లో షారుఖ్ ఖాన్ ఫ్యాన్. ఐతే కొన్నిసార్లు మన అభిరుచులు మారుతుంటాయి. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తున్నా. ఇప్పుడాయనే నా ఫేవరెట్ బాలీవుడ్ హీరో.

అలాగే తమిళ హీరో విజయ్ అన్నా చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తున్నాను. తుపాకి.. కత్తి సినిమాలు బాగా నచ్చాయి. విజయ్ సినిమాలన్నింట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి అని బన్నీ చెప్పాడు. ఇక బాలీవుడ్లో ఏ హీరోయిన్ తో పని చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఆలియా భట్.. పరిణీతి చోప్రాల పేర్లు చెప్పాడు అల్లు అర్జున్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు బన్నీ.

SHARE