పాపం.. బన్నీ చతికిలబడ్డాడు

0
594
allu arjun sarainodu movie television trp rating low

Posted [relativedate]

allu arjun sarainodu movie television trp rating lowవరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.  గత ఏడాది సూపర్ సక్సెస్ ను సాధించిన సరైనోడు.. మాస్ ఆడియన్స్ లలో అతనికి విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ సినిమా  అతని సినీ కెరీర్ లో బిగ్గెస్ట్  మైల్ స్టోన్.  తన ప్రతీ చిత్రం 50కోట్ల క్లబ్ లో చేరేలా జాగ్రత్త తీసుకుంటూ  బన్నీ  వెండితెర మీద వెలిగిపోతున్నాడు. అయితే బుల్లితెర మీద మాత్రం చతికిలబడ్డాడు.

జనరల్ గా  హిట్టైన చిత్రాలకు బుల్లితెరఫై విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్ వస్తుంటాయి. కానీ సరైనోడు విషయం లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.  ఇప్పటివరకు మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమా వెండి తెర ప్రేక్షకులనే కాక బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకోలేక అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. అయితే బన్నీ సరైనోడు మాత్రం బ్రహ్మోత్సవం కంటే దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ ను నమోదు చేసిందట. అంటే వెండితెరపై వెలుగుతున్న బన్నీ బుల్లి తెరపై చతికిలపడ్డట్టేగా.

Leave a Reply