Posted [relativedate]
స్మాల్ స్క్రీన్ మీద హల్ చల్ చేస్తున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఓ పక్క సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరో పక్క బుల్లితెర మీద తన సరదా ప్రోగ్రామ్స్ తో సందడి చేస్తుంది. అయితే ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా ట్రై చేసిన శ్రీముఖి అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ జస్ట్ లో మిస్ అయ్యింది. అదెలా అంటే హరీష్ శంకర్ డైరక్షన్లో బన్ని చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ కు ఛాన్స్ ఉండగా ఆ రోల్ కోసం శ్రీముఖిని తీసుకోవాలని ఆలోచన చేశారట దర్శక నిర్మాతలు. దానికి అల్లు అర్జున్ మాత్రం ససేమీరా ఒప్పుకోలేదట. ఆల్రెడీ జులాయిలో ఆమెకు బ్రదర్ గా నటించిన బన్ని ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేసేందుకు నిరాకరించాడట. కారణం ఇదొక్కటేనా లేక స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా గురించి అంతా ముందే లీక్ చేస్తుంది అన్న సాకుతోనో తెలియదు కాని శ్రీముఖిని తన పక్కన పెట్టే ఆలోచన మాత్రం విరమించుకోండని గట్టిగానే చెప్పాడట బన్ని.
ప్రస్తుతం కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న డిజె షూటింగ్ మళ్లీ త్వరలో స్టార్ట్ అవనుంది. సరైనోడు తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.