రెండు రోజుల్లో పూర్తి చేయల్సిన డబ్బింగ్‌కు 10 రోజులు.. ఇందుకే

0
581
allu arjun take more time for duvvada jagannadham movie dubbing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

allu arjun take more time for duvvada jagannadham movie dubbingఅల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డీజే’. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సారి అల్లు అర్జున్‌ ఈ సినిమాలో అయ్యగారిగా కనిపించబోతున్నాడు. బన్నీ విభిన్న పాత్రలో నటించడంతో పాటు పూజ హెగ్డే అందాల ఆరబోతతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఆ రేంజ్‌ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపై కూడా ఎంతో జాగ్రత్తలను దర్శకుడు తీసుకుంటున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మామూలుగా అయితే ఒక హీరో తన పాత్రకు డబ్బింగ్‌ను రెండు లేదా మూడు రోజుల్లోనే చెప్పేస్తాడు. కాని అల్లు అర్జున్‌ ఈ సినిమాలోని పాత్ర కోసం పది నుండి పది హేను రోజుల పాటు కేటాయించినట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్‌కు పూర్తి భిన్నంగా అల్లు అర్జున్‌ ఈ సినిమాలో నటించాడు. అలాగే అయ్యగారి పాత్ర పోషించాడు. అందుకే డైలాగ్స్‌ కూడా అదే తరహాలో ఉండనున్నాయి. అయ్యగారు ఎలా మాట్లాడతారో ఆ యాసతో అల్లు అర్జున్‌ డబ్బింగ్‌ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒక వేద పండితుడి సమక్షంలో ఈ డబ్బింగ్‌ కార్యక్రమం జరుగుతుందని, ఏ ఒక్క సీన్‌లో కూడా తేడా రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆలస్యం అయినా పర్వాలేదు అని ఇన్నాళ్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో ‘డీజే’ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply