‘డీజే’ టార్గెట్‌ ఎన్టీఆర్‌?

0
670
Allu Arjun Targeted NTR Movie Records

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ తాజాగా నటించిన ‘డీజే’ చిత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుండి కూడా అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. భారీ స్థాయిలో అంచనాలున్న ‘డీజే’ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలై అంచనాలను మరింతగా పెంచింది. బన్నీ కెరీర్‌లో ‘డీజే’ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దిల్‌రాజుకు ఈ సినిమా 25వది కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్‌తో నిర్మించడం జరిగింది. దాంతో సినిమాపై సినీ వర్గాల్లో అంచనాలు గత బన్నీ చిత్రాలతో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రంతో బన్నీ 100 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ను సాధించాలని మెగా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ‘బాహుబలి’ కాకుండా టాలీవుడ్‌లో టాప్‌ చిత్రం ‘ఖైదీ నెం.150’. ఆ చిత్రం తర్వాత స్థానంలో ‘శ్రీమంతుడు’ చిత్రం ఉంది. దాని తర్వాత స్థానంలో ఎన్టీఆర్‌ నటించిన ‘జనతాగ్యారేజ్‌’ చిత్రం ఉన్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఇప్పుడు బన్నీ ముందు ఉన్న టార్గెట్‌ ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ కలెక్షన్స్‌ను క్రాస్‌ చేయడం. ఎన్టీఆర్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రం కలెక్షన్స్‌ కంటే ఎక్కువ సాధించడం. జనతాగ్యారేజ్‌ చిత్రం కలెక్షన్స్‌ను సాధించవచ్చేమో కాని, జై లవకుశ చిత్రం మాత్రం భారీగా వసూళ్లు సాధించనుందనే టాక్‌ వస్తుంది. దానిపై కూడా బన్నీ ఫోకస్‌ చేశాడు. మరి ఎన్టీఆర్‌ ఆ రెండు సినిమాల కంటే ‘డీజే’ పై స్థాయిలో ఉంటుందా అనేది చూడాలి.

Leave a Reply