కేరళకు బన్నీ థాంక్స్..

 allu arjun thanks kerala peopleఅల్లు అర్జున్ ‘సరైనోడు’ టాలీవుడ్‌లో మంచి విజయం నమోదుచేసుకుంది. స్లో అండ్ స్టడీగా మొదలుపెట్టి సూపర్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత కేరళలోను ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ రూ.8 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ‘సరైనోడు’తో మాలీవుడ్‌లో మన స్టైలిష్ స్టార్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అర్జున్ కి ‘స్టార్ ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్’ వారు ‘ప్రవాసి రత్న’ పురస్కారంతో సత్కరించారు.

‘ఓనం’ పండుగ సందర్భంగా దుబాయ్ లోని మలయాళీలు ‘పూనోనం -2016’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మలయాళ చిత్రపరిశ్రమ ప్రముఖులు .. అభిమానుల సమక్షంలో ‘ప్రవాసి రత్న’ పురస్కారాన్ని అల్లు అర్జున్ అందుకున్నారు. తెలుగు అభిమానులతో సమానంగా తనను అక్కున చేర్చుకున్న మలయాళీల అభిమానానికి ఉప్పొంగిపోయాడు అర్జున్. తనను తమలో ఒకడిగా భావించి ప్రేమిస్తున్న మలయాళీలకు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పాడు.

SHARE