‘పంతుల్ కోచింగ్’లో బన్నీ బిజీ !

0
486

Posted [relativedate]

   allu arjun training brahmans body language duvvada jagannadham movie purpose

‘రుద్రమ దేవి’ చిత్రంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ గోనా గన్నారెడ్డి పాత్రలో కేక పుట్టించిన విషయం తెలిసిందే. తెలంగాణ యాసలో బన్నీ పలికన డైలాగ్స్ కి థియేటర్స్ విజుల్స్ పడ్డాయి. ‘గమ్మునుండవోయ్.. ‘ అంటూ గోన గొన్నారెడ్డి బాడీ లాంగ్వేజ్ ని అచ్చుగుద్దినట్టు దించేశాడు బన్నీ. ఇందుకోసం తెలంగాణ యాసలో ముందస్తు తర్పీదు కూడా తీసుకొన్నాడట.

తాజాగా, మరోసారి బన్నీ కోచింగ్ బాట పడ్డాడు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ న‌టించే సినిమా ‘డీజే’…దువ్వాడ జ‌గ‌న్నాథం. ఈ చిత్రంలో బ‌న్ని రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇందులో ఒకటి బ్రాహ్మిణ. ఈ పాత్ర ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడం ఖాయామని చెబుతున్నారు. ఈ పాత్రని ఫర్ పెక్ట్ గా పండించేందుకు కోచింగ్ తీసుకుంటున్నాడు బన్నీ. బ్రహ్మీన్స్ మాట్లాడే మాటల దగ్గర నుండి వాళ్ల బాడీ లాంగ్వేజ్ ని ఒంటబట్టించుకొంటున్నాడు. ఇందుకోసం ఒకరిద్దరు బ్రహ్మణులని నియమించుకొన్నాడట. అందుకు గానూ ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున చెల్లిస్తున్నాడ‌ని సమాచారమ్.

ఇక, డీజె.. అక్టోబర్ 21 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. బన్నీ మాత్రం నవంబర్ లో షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

Leave a Reply