తోడు కోసం బన్నీ వేట ….

0
480

allu-arjun-wanted-new-heroi

హరీష్ శంకర్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందనున్న కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఈ సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయిందని అంటున్నారు. వీలైతే.. ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వెళ్లిపోవచ్చు. కానీ కథానాయిక ఇష్యూలోనే ప్రాబ్లమ్ వచ్చినట్లు టాక్.

బన్నీకి జోడీగా ముకుంద బ్యూటీ పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే బాలీవుడ్ పై కన్నేసిన ఆ భామ డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందట. దాంతో ‘రేసుగుర్రం’లో మెరిసిన శృతి హాసన్ ను తీసుకోవాలని చిత్రబృందం ఆమెను సంప్రదించింది. స్టైలిష్ స్టార్ తో మరో సినిమా చేయాలన్న ఉత్సాహం ఉన్నా.. చేతినిండా చిత్రాలు ఉండడంతో.. కాల్షీట్స్ కుదరక సున్నితంగా ఈ ఆఫర్ తిరస్కరించిందట ఈ సొగసరి.

ప్రస్తుతం సింగం-3, శభాష్ నాయుడు సినిమాలతో బిజీగా ఉంది శృతి. వీటితో పాటు పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది. దీంతో అల్లు అర్జున్ పిక్చర్ లో చేయడానికి అమ్మడికి వీలుపడడంలేదు. ఇదే విషయాన్ని వివరించడంతో బన్నీ మూవీ టీమ్ మరో హీరోయిన్ కోసం వెతుక్కుంటోందని సమచారం.

Leave a Reply