మోహన్ లాల్ ‘1971..’లో అల్లు శిరీష్ !

 Posted October 22, 2016

allu sirish act mohan lal 1971 beyond borders movieఅల్లు శిరీష్ హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే ‘శ్రీరస్తు శుభమస్తు’తో తొలి విజయాన్ని అందుకొన్నాడు. ఇకపై కూడా శిరీష్ కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది మెగా కాంపౌండ్. అయితే, ఈలోపు బంపర్ ఆపర్ ని కొట్టేశాడు శిరీష్. మళయాళ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న మళయాళ చిత్రం “1971 బియాండ్ బోర్డర్స్” లో శిరీష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

1971లో పాకిస్థాన్ యుద్దం నేపథ్యంలో..  “1971 బియాండ్ బోర్డర్స్” చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శిరీష్ ట్యాంక్ కమాండర్ గా కనిపించబోతున్నాడు. ఇది ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్. ఇది శిరీష్ కి మంచి అవకాశంతో పాటుగా మళయాళంలో ఎంట్రీ ఇచ్చేందుకు కూడా దోహదపడనుంది. ఈ బంపర్ ఆఫర్ పై శిరీష్ ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇప్పటికే స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి మాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాడు.మరి.. .మాలీవుడ్ లో శిరీష్ కి హిట్ దక్కుతుందేమో చూడాలి.

SHARE