ఈ గీతా కృష్ణ గీతే…

  allu sirish clarified about geetha arts banner
అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ …ఒక్క టాలీవుడ్ లోనే కాదు ..బాలీవుడ్ లోనూ భారీ చిత్రాలు అంతకన్నా భారీ విజయాలు సాధించింది.ఆ విజయాల వెనుక మాస్టర్ బ్రెయిన్ అరవింద్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే ఆయన బ్యానర్ కి గీతా ఆర్ట్స్ అని పేరెందుకు పెట్టారో బయటకు వచ్చింది.అరవింద్ కుమారుడు శిరీష్ స్వయంగా ఆ వివరాలు వెల్లడించాడు.

గీతా ఆర్ట్స్ పేరు తమ అమ్మదని చాలా మంది అనుకుంటారని ..కానీ ఆమె పేరు నిర్మల అని శిరీష్ చెప్పాడు.తండ్రి అరవింద్ కి ఎంతో స్ఫూర్తి ఇచ్చిన భగవద్గీత నుంచే తమ బ్యానర్ కి గీతా అని పేరు పెట్టారని వివరించాడు.మొత్తానికి ఈ గీతా కృష్ణ గీతేనని కృష్ణాష్టమి రోజే శిరీష్ చెప్పడం విశేషం

SHARE