20 ఏళ్ళ తర్వాత అక్కడికి పోతున్న అమల..

 amala act malayalam movie c/o saira bhanu  after 20 years హీరోయిన్‌గా వెలిగిపోయిన కాలంలో అమల దక్షిణాది భాషల చిత్రాల్లో బిజీయెస్ట్ నటి. అక్కినేని నాగార్జునతో వివాహంతో కుటుంబానికే పరిమితమైపోయారు. ఆ మధ్య శేఖల్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫల్‌’లో కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా అమల మలయాళ సినిమాలో నటించనున్నారని అంటున్నారు. అదే జరిగితే..దాదాపు 20 ఏళ్ల తరువాత ఆమె మలయాళ తెరపై కనిపిస్తారు.

కొత్త దర్శకుడు ఆంటోనీ సోనీ సెబాస్టియన్ తెరకెక్కిస్తున్న ‘కేరాఫ్ సైరాబాను’ చిత్రంలో అమలా కీలకమైన పాత్రలో కనిపిస్తారట. ఆమె లాయర్గా నటించనున్నారని వినికిడి. సైరాబాను పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తుంది. ఓ సాధారణ ముస్లిం గృహిణికి, ఆమె కుమారుడికి మధ్య ఉన్న అనుబంధమే చిత్ర కథనంగా తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది.

SHARE