అమరావతికి రేపు టఫ్ డే ..

  amaravathi capital high court judgement swiss challenge tomorrow
ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి ప్రస్థానంలో రేపు అంటే సెప్టెంబర్ 16 గడ్డు రోజుగానే చెప్పుకోవాలి.రాజధాని నిర్మాణం కోసం సర్కార్ అనుసరించ తలపెట్టిన స్విస్ ఛాలెంజ్ విధానం పై ఇంతకుముందే హై కోర్ట్ స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే తొలిగించాలని ఏపీ సర్కార్ హైకోర్ట్ ముందు వాదన వినిపించింది.వాదనల అనంతరం కోర్ట్ విచారణని రేపటికి వాయిదా వేసింది.

మరోవైపు అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదంటూ ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని కొందరు ఆశ్రయించారు.ఆ కేసు విచారణ కూడా రేపటికి వాయిదా పడింది.పర్యావరణ అనుమతుల విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు కీలకం కానుంది.

SHARE