మోడీ సర్కార్ కు అమరావతి పాఠాలు

0
574

  amaravathi peoples giving land independently ap అమరావతికి మట్టి,నీళ్లు మాత్రమే ఇచ్చిన మోడీ సర్కార్…కొత్త రాజధాని నుంచి పాఠాలు మాత్రం బాగానే నేర్చుకొంటోంది.దేశ వ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో భూసమీకరణ ఇంత ప్రశాంతంగా జరిగిన దాఖలాల్లేవు…పశ్చిమ బెంగాల్, సింగూర్ వద్ద ప్లాంట్ కి సంబంధిచిన హింస,టాటా లు వ్యాపార కేంద్రంగా మార్చుకోవడం మన కళ్లముందు జరిగిన కథ…ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు అడపాదడపా జరుగూతూనే వున్నాయి…

ఈ పరిస్థితుల్లో కొత్త రాజధాని కోసం అమరావతి ప్రాంతంలో 30 వేలకు పైగా ఎకరాల్ని రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం కేంద్ర హోం శాఖ వర్గాలని ఆశ్చర్య పరిచింది.అసలు మొత్తం విధానం ఎలా జరిగింది.అన్న దానిపై అధ్యయనం చేస్తోంది.అందులో భాగంగా CRDA అధికారులు రైతులకు ఇస్తున్న ప్యాకేజి, నిర్మాణానికి అనుసరిస్తున్న వ్యూహాలు,విధానాలపై సమగ్ర ప్రజంటేషన్ ఇచ్చారు..మట్టి నీళ్లు ఇచ్చిన మోడీ సర్కార్ కు దేశానికి ఉపయోగపడే పాఠాల్ని అమరావతి చెప్తోంది.దీంతో వచ్చేది వరిగేది లేకున్నా…ఆంధ్రులు గర్వించాల్సిన విషయమే కదా?

Leave a Reply