శాటిలైట్ టౌన్ షిప్స్ గా అమరావతి పరిసర ప్రాంతాలు

Posted December 15, 2016

amaravathi

 

అమరావతి గురించి చారిత్రక నేపథ్యం తీసుకొంటే …తారకాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు. అతడి నుంచి కాపాడాలని దేవతలు మొరపెట్టుకున్నారు. వారికి సైన్యాధిపతిగా కుమారస్వామి తారకాసురునిపై దండెత్తి అతని కంఠంలో వేలాడుతున్న అమృత లింగాన్ని ఛేదించాడు. దాంతో, అమృత లింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటిలో పెద్ద ముక్క పడిన ప్రదేశమే అమరావతి.ఈ ప్రాంతం లో స్వర్గలోకాధిపతి ఇంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగా, ఆయన రాజధాని అయిన అమరావతిగా పేరు వచ్చింది.ఈ ప్రాంతాన్ని గౌతమి పుత్ర శాతకర్ణి ఆఖరి గా పరిపాలించిన రాజు (త్వరలో విడుదల కానున్న నందమూరి బాలకృష్ణ సినిమా ).ప్రస్తుతం ఆంధ్ర రాజధానిగా విలసిల్లుతోంది .ఇంతటి చారిత్రక నేపధ్యం వున్నా ఈ ప్రాంతం ఇప్పుడు మరింత ప్రగతి పదం లో నడిచేలా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో బీజాలు పడుతున్నాయి త్వరలో ఈ ప్రాంతం లో రింగ్ రోడ్ నిర్మాణం జరగనుంది. రింగ్ రోడ్ నిర్మాణ ప్రక్రియ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలనీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు అధికారులని ఆదేశించారు.

అమరావతి ప్రాంతం లో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందటం వల్ల రాజధాని పరిధిలోని శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను 30 నుంచి 45 నిమిషాల్లో చేరుకునేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయటం కోసం సర్క్యూలర్ రైల్ ను ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.
*తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నై–కోల్‌కతా, విజయవాడ–ముంబై, విజయవాడ–జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు
** కొత్తగా నిర్మించబోయే అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేకి అనుసంధానంగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌
** మురికివాడల రహిత నగరాలు, పట్టణాలు అభివృద్ధి చేసేందుకు గానూ డెవలపర్ల సహకారంతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచన.
**105 కిలోమీటర్ల పొడవునా సుమారు రూ.10 వేల కోట్లతో విజయవాడ–అమరావతి–గుంటూరు–తెనాలి –కృష్ణా కెనాల్‌ స్టేషన్‌–విజయవాడ మీదుగా లైన్ నిర్మిస్తారు .

SHARE