అమరనాథ్ యాత్ర అయిపోయింది ..

 amarnath yatra successfully finishedఅమర్ నాథ్ యాత్ర సక్సెస్ గా ముగిసింది. రాఖీ పండుగ రోజే ఈ యాత్ర సంపూర్ణమైంది. జులై 2న పహల్ గామ్ , బాల్ టాల్  మార్గాల ద్వారా అమర్ నాథ్ 
యాత్ర ప్రారంభమైంది. దాదాపు 40 రోజుల పాటు సాగిన యాత్రలో ఈ ఏడాది రెండు లక్షలకు పైగా భక్తులు…మంచు లింగాన్ని దర్శించుకొని ప్రత్యేక  పూజలు చేశారు. అయితే గడిచిన పదేళ్లలో ఇంత తక్కువ మంది భక్తులు అమర్ నాథ్ లింగాన్ని సందర్శించటం ఇదే మొదటి సారి.
అమర్ నాథ్ గుహ సంరక్షకులు మహంత్ దీపింద్ర గిరి ఆధ్వర్యంలోని సాధువులు, భక్తులు ఛడీ ముబారక్ గా పిలుచుకొనే పరమశివుడి పవిత్ర చామరాన్ని…పవిత్ర గుహకు తీసుకెళ్లారు. గర్భగుడిలో సంప్రదాయ పూజలు తర్వాత.. సాయంత్రం తిరుగు యాత్ర మొదలైంది. దీంతో అధికారికంగా అమర్ నాథ్ యాత్ర ముగిసింది. 
అయితే యాత్ర ముగిసిన సందర్భంగా…రేపు..పహల్ గామ్ లోని లీడర్ నది ఒడ్డున ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు సాధువులు.  కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగిన యాత్రలో… మొత్తం 29 మంది గుండెపోటుతో మరణించారు. మరోవైపు 50 మంది యాత్రికులకు గాయాలయ్యాయి.
SHARE