Posted [relativedate]
మన ఆవు ..దాని పేడ కానీ అమ్ముతోంది అమెజాన్. అది అమ్మితే మాత్రం కొనేవాడు ఉండొద్దా ? ఇదేనా మీ డౌట్. ఆ సందేహం ఏమీ అవసరం లేదు.అమెజాన్ ఆవు పేడని పిడకలు చేసి ఆన్ లైన్ లో అమ్మేస్తోంది. రేట్ ఎంతో తెలుసా ? 8 పిడకలున్న ప్యాకెట్ ఒక్కోటి 100 రూపాయలు. సంక్రాంతి సీజన్ రావడంతో భోగి మంటల్లో వాడేందుకు అవసరం ఉంటుంది కదాని ఈ పిడకల మార్కెటింగ్ మీద అమెజాన్ దృష్టి సారించింది.ప్రకటనలు కూడా ఇస్తోంది.
అయితే అమెజాన్ మార్కెట్ వ్యూహం ఎండిపోయిన పిడకలతో ఆగుతుందా లేక పచ్చి పేడ తో ముగ్గుల్లో పెట్టె గొబ్బెమ్మల దాకా వస్తుందా ? ఏమో చెప్పలేము ..గుర్రం ఎగరావచ్చు …ఆవు పేడని ఎలాగైనా అమెజాన్ అమ్మేయవచ్చు.పిడకలు అవసరమైతే మీరు కూడా అమెజాన్ ని ఆన్ లైన్ లో సంప్రదించండి.ఇక ఆలస్యమెందుకు?