పాపం.. అంబానీ జీతం పెరగలేదు

 ambani salary

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వేతనం వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా 15 కోట్ల రూపాయలుగానే ఉంది. సంస్థకు చెందిన మిగతా ఉద్యోగులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వేతనాలు పెరిగినప్పటికీ అంబానీ మాత్రం 15 కోట్ల రూపాయలనే తీసుకుంటున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి అంబానీ వేతనం 15 కోట్ల రూపాయలు (జీతం, అలవెన్సులు, పెర్కులు, కమీషన్‌సహా)గానే ఉంటుండగా, ఏటా సాధారణంగా పెరిగితే 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 24 కోట్ల రూపాయలకు చేరి ఉండేది. 2009 అక్టోబర్‌లో తన వేతనాన్ని 15 కోట్ల రూపాయల వద్దే ఉంచుకోవాలని అంబానీ స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here