ముద్రగడ @ వైస్సార్సీపీ ..

Posted November 15, 2016

ambati rambabu fires on chinna rajappa and dgp
కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి వైస్సార్సీపీ వెన్ను దన్నుగ నిలుస్తోందా ..? అవుననే అభిప్రాయమే వ్యక్తం ఆవుతోంది .

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆందోళన చూస్తుంటే అలానే ఉంది .ముద్రగడ పాదయాత్ర చేయడానికి అనుమతి లేదని హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ అంటున్నా . వాళ్లిద్దరూ చెప్పినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా అని అంబటి వెనకేసుకు రావడం బట్టి చూస్తే ముద్రగడ ,కాపు పేటెంట్ హక్కులన్నీ ఒక్క వైస్సార్ సీపీ కె చెందుతాయని లేని చుట్టరికం కలుపుకొంటున్నట్టుగా వుంది .

ముద్రగడ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అంబటి మాట్లాడుతూ పద్మనాభం ఇంటి పక్కన చిన్న జిన్నింగు మిల్లు ఉంటే దాన్ని ఆక్రమించుకుని పోలీసులు అక్కడ చేరారని, ఇది సరైన విధానం కాదు, దీన్ని మార్చుకోవాలని చెబుతున్నామని అన్నారు. ముద్రగడను అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, పాదయాత్రను అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతాయని అయన తరపున ఈయన హెచ్చరించారేమో అనేలా ఉంది చెప్పిన పద్దతి .

15 వేల మంది పోలీసులను మోహరించారని, ఇది ప్రజాస్వామ్యమా, రాచరికమా, మిలటరీ పాలన సాగుతోందా అని ప్రశ్నించారు. పోలీసులను అక్కడ పెట్టి ఏం చేయాలనుకున్నారని, రాష్ట్రాన్ని ఎలా పాలించాలనుకుంటున్నారని నిలదీశారు ఏం సెక్యూరిటీ అనుకోవచ్చుగా ..?

SHARE