భౌ ..భౌ కోసం అంబులెన్సు వచ్చింది

0
249
ambulance for dogs

Posted [relativedate]

ambulance for dogsవిశ్వాసానికి మారు రూపం కుక్క మరి అలాంటి విశ్వాసానికి జబ్బు చేస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళతాం. మరి ఎమర్జెన్సీ ఐతే అంబులెన్సు కావాలి కదా మనుషులకి ఐతే అంబులెన్సు ఉంటుంది కానీ కుక్కలకి అంబులెన్సు ఏమిటి అనే కదా ..ఎస్ వాటికోసం కూడ అంబులెన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో కాదు మన భారత దేశం లోనే అది కూడా మన దేశం లోని చండీగఢ్ లో …ప్రభుత్వ పశువైద్యశాల అంబులెన్సు సర్వీసుకు ఫోన్ చేస్తే చాలు… అంబులెన్స్ మీ ఇంటి ముంగిటకు వచ్చి మీ కుక్కను లేదా పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేసి తిరిగి మీ ఇంట్లో దాన్ని డ్రాప్ చేసి వెళ్లారు .

ఎంపీల్యాడ్స్ నిధులతో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా అంబులెన్సు సర్వీసును ప్రారంభించింది. ఈ అంబులెన్సులో పెంపుడు కుక్కలకు ప్రథమ చికిత్స చేసే సౌకర్యంతోపాటు అత్యవసర సమయంలో వాటికి చికిత్స చేసేందుకు వీలుగా పారావెటర్నీర సిబ్బంది అందుబాటులో ఉన్నారు. చంఢీఘడ్ నగరంలోని మఖన్ మజ్రా, జుమూరు ఫైదాన్, రాయపూర్ కలాన్, రాయపూర్ ఖుర్ధు ప్రాంతాల్లో వారం రోజుల చొప్పున అంబులెన్సు సేవలందిస్తుంది ఐతే కేవలం 300 రూపాయల రుసుము మాత్రం తీసుకొంటారు.విశ్వాసానికి ౩౦౦ మేటర్ కాదు కదా ..

Leave a Reply