బీజేపీలోకి శ‌కునిమామ!!

0
236
ameer singh into bjp

Posted [relativedate]

ameer singh into bjp
వైఎస్ కు కేవీపీ ఎంతో ములాయం సింగ్ యాద‌వ్ కు అమ‌ర్ సింగ్ అంతేన‌ని చెబుతారు. అంతెందుకు అమ‌ర్ కోసం ములాయం త‌న కొడుకు అఖిలేశ్ కోసం గొడ‌వ‌ప‌డ్డారు. చివ‌ర‌కు పార్టీ ముక్క‌ల‌య్యే వ‌ర‌కు విష‌యం వెళ్లింది. ఈలోపే తాను ఉండ‌లేనంటూ అమ‌ర్ సింగ్ చికిత్స పేరుతో విదేశాల‌కు వెళ్లిపోయారు. ఆయ‌న చికిత్స కోసం లండ‌న్ వెళ్లార‌ని చెప్పారు. ఇక ఎన్నిక‌ల త‌ర్వాతే ఆయ‌న ఇండియాకొస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఈలోపే ఏం జ‌రిగిందో కానీ అమ‌ర్ సింగ్ … బీజేపీలో చేర‌బోతున్నార‌ని వార్త‌లొచ్చాయి. అమిత్ షాతో ఆయ‌న ట‌చ్ లో ఉన్నార‌ని టాక్. అన్నీ కుదిరితే బీజేపీ ప్ర‌చార సార‌థుల్లో అమ‌ర్ సింగ్ కూడా చేర‌వ‌చ్చ‌ని స‌మాచారం. ఈ ఊహాగానాల‌పై స్వ‌యంగా ఆయ‌నే క్లారిటీ ఇచ్చారు. బీజేపీలో ఎప్పుడు చేర‌బోయేది అంద‌రికీ చెబుతాన‌న్నారు. అంద‌రికీ చెప్పే బీజేపీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించారు.

ఎప్ప‌టికీ తాను ములాయం మ‌నిషినేన‌ని చెప్పుకునే అమ‌ర్ సింగ్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవడంతో ములాయం ఒక్క‌సారిగా షాక‌య్యార‌ట‌. అమ‌ర్ ఇంత ప‌ని చేస్తాడ‌ని ఊహించ‌లేద‌ని ఫీల్ అవుతున్నార‌ట‌. అయితే ఆ విష‌యం త‌న‌కే డైరెక్ట్ గా చెబితే సంతోషించే వాడ‌న‌ని ములాయం అన్న‌ట్టు టాక్.

మొత్తానికి స‌మాజ్ వాదీ పార్టీ అభివృద్ధిలో ములాయంకు వెన్నంటి నిలిచిన అమ‌ర్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేర‌డం ఎస్పీకి మాత్రం పెద్ద షాకేనంటున్నారు విశ్లేష‌కులు. అయితే స‌మాజ్ వాదీ సీక్రెట్ల‌న్నీ తెలిసిన అమ‌ర్ …..సైకిల్ కు న‌ష్టం చేకూర్చేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాజ్ వాదీ క్యాడ‌ర్ మండిప‌డుతున్నారు.

Leave a Reply