శ్రీకృష్ణుడు అవతారం చాలించిందెప్పుడు?అమెరికా ఏమంది?

0
801

Posted [relativedate]

 america scientists said lord krishna life
శ్రీ కృష్ణుడు చారిత్రక పురుషుడా?పౌరాణిక పాత్రా? ఈ చర్చ ఎప్పటినుంచో సాగుతూనే వుంది.అయితే ఇటీవల అమెరికా పరిశోధకులు మనిషి ఆయుర్దాయం పై వెల్లడించిన వివరాలు మళ్లీ కృష్ణుడి జీవితకాలంపై దృష్టి మళ్లింది.మనిషి జీవిత కాలాన్ని పెంచడం అనే లక్ష్యంతో అమెరికన్ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.మనిషి చిరంజీవి కావడం అసాధ్యం.అన్ని విధాలుగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే …అత్యద్భుతంగా జీవించగలిగితే 120 ఏళ్ళకి కాస్త అటుఇటుగా బతగ్గలడు అని పరిశోధకులు తేల్చారు.

  The Supreme Lord and His Incarnations

దీంతో శ్రీకృష్ణుడు సంపూర్ణ స్వరూపమని అయన 120 ఏళ్ళకి పైగా బతికాడని కొందరు జోతిష్యాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అందుకు వాళ్ళు జోస్యం ప్రకారం నవగ్రహాల పూర్తి దశల కాలం 120 ఏళ్లని గుర్తు చేస్తున్నారు.కేతు దశ 7,శుక్ర 20,సూర్య 6,చంద్ర 10,కుజ 7,రాహు 18 ,గురు 16,శని 19,బుధ దశ 17 సంవత్సరాలు..సహజంగా ఒకే జీవితకాలంలో అన్ని గ్రహ దశల్ని అనుభవించలేము.కానీ శ్రీకృష్ణుడు దేవుడు కావడాన ఆయనకి అది సాధ్యమైందని జోస్యుల వాదన.తాజా అమెరికా పరిశోధన ఫలితాలు శ్రీకృష్ణుడి జీవితకాలం నిజమేనని ధృవీకరిస్తున్నట్టు కూడా జోస్యులు అంటున్నారు.

Image result for sri jagadguru adi shankaracharya shodh sansthan said about lord krishna

ఇక జగద్గురు ఆదిశంకరాచార్య శోధ్ సంస్థాన్ కృష్ణ జీవిత కాలం మీద 12 ఏళ్ల కిందటే ఓ పరిశోధనా పత్రాన్ని ప్రకటించింది.దాని ప్రకారం శ్రీకృష్ణ మహా నిర్యాణ దినాన్ని కూడా జరుపుతోంది.పౌరాణిక గ్రంధాల ఆధారంగా వారు వెల్లడించిన విషయాలు ఇవి ..

1.శ్రీ కృష్ణుడు 125 ఏళ్ల 7 నెలల 6 రోజులు జీవించారు
2.హిరన్ నది ఒడ్డున ఇప్పటి కాలమానం ప్రకారం3012 బీసీ ,ఫిబ్రవరి 18 న మధ్యాహ్నం 2 గంటల 27 నిమిషాల 30 సెకెన్లకి అవతారం చాలించారు
3 .విష్ణు పురాణం, భగవద్గీత ప్రకారం మహా భారత యుద్ధం ముగిసిన 36 ఏళ్ళకి కృష్ణుడు ద్వారక విడిచి వెళ్లారు .ఆపై అయన ఎవరికీ కనిపించలేదు.
4.మహాభారత సమయానికి కృష్ణుడి వయసు 89 ఏళ్ళు అని మత్స్య పురాణం చెబుతోంది .
5.ప్రతి ఏడు చైత్ర మాసం తొలి రోజుని కృష్ణ నిర్యాణ దినంగా పాటించాలి .ఆ లెక్క ప్రకారం తొలిసారిగా సోమనాథ్ ట్రస్ట్ 2009 ఏప్రిల్ 9 న ఆ దినాన్ని పాటించింది.
మొత్తానికి అమెరికన్ పరిశోధనల ఫలితాలతో మరోసారి కృష్ణ జీవిత కాలం మీద చర్చ సాగుతోంది.గతించిన కాలాన్ని శోధించే ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది.ఈ మధనంలో మరెన్ని విషయాలు వెలుగుచూస్తాయో ..

Leave a Reply