అమెరికా ఇక్కడా వేలు పెట్టింది ..

0
517

 american heritage foundation company lisa curtis put hand modi independence speech pakistan belochistan peopleపాక్ ఆక్రమిత కాశ్మీర్, బెలూచిస్తాన్, గిల్జిట్‌లపై మోడీ విధానంపై అమెరికాలోని దక్షిణాసియా దేశాల మేధోవర్గం స్పష్టత కోరింది. గతంలో పాకిస్తాన్‌తో చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించిన మోడీ తాజాగా స్వాత్రంత్య దినోత్సవ వేడుక ల్లో బెలూచిస్తాన్‌పై తాడోపేడో తేల్చుకునేలా మాట్లాడటం కాస్త గందరగోళానికి దారి తీసింది. భారత్ పాలనపై కాశ్మీరీల్లో కనిపిస్తున్న అసంతృప్తిని బయటకు కనపడనీ యకుండా దేశంపై వారికీ అభిమానముందనే భావాన్ని కలగజేయడం ఇప్పుడు మోడీ ముందున్న అతిపెద్ద సవాలు అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ లబ్ధిని చేకూర్చే తాత్కా లిక విధానా ల కంటే శాశ్వత పరిష్కారాలకే ప్రజలు మొగ్గు చూపుతారని విక్రమ్ తెలిపారు.

ప్రధాని ప్రసంగంలో బెలూచిస్తాన్ ప్రస్తావన రావడం పాకిస్తాన్‌తో దౌత్య విధానంలో మోడీ ప్రభుత్వ మార్పును స్పష్టంగా తెలియ జేస్తోందని అమెరికన్ మేథో సంపత్తి సంస్థ ది హెరిటేజ్ ఫౌండేషన్ సభ్యులు లిసా కర్టిస్ తెలిపారు. అయితే దీనికి భారత్ కొత్తగా తీసుకునే చర్యలేంటో తెలియరావట్లేదు.మరోవైపు ఉగ్ర వాదంపై కేంద్రం మెతకవైఖరి వహించబోదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెల్లేందుకు మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లూ కనిపిస్తోందని లీసా చెప్పారు. మన్మోహన్ ప్రభుత్వం చర్చలకే ప్రాధాన్యతనిచ్చినట్లు  గుర్తు చేశారు. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, బెలూచి స్తాన్‌లపై ఒబామా ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్యలు చేయ లేదు.

Leave a Reply