Saturday, September 18, 2021
Homelatestవదల బొమ్మాళీ వదల

వదల బొమ్మాళీ వదల

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకిలా చావగొడుతున్నారు..? భారతీయులు ఎక్కడున్నా వదలకుండా వేధిస్తున్నాడే..? పదవిలోకి రాగానే హెచ్ 1 బీ వీసాలపై సవాలక్ష ఆంక్షలు విధించిన ట్రంప్.. ముఖ్యంగా ఇండియానే టార్గెట్ చేశాడు. ఇప్పుడు కూడా ఇరాన్ పై ఆంక్షలు విధించేలా చేసి పరోక్షంగా ఇండియా పనిపట్టాలనేదే ట్రంప్ వ్యూహం. అయితే ట్రంప్ కారణంగా అమెరికాలోని తెలుగువారే కాదు.. ఖతార్లో ఉన్న ఇండియన్స్ కూడా బిక్కుబిక్కుమంటున్నారు.

ఖతార్ పై సౌదీ సహా నాలుగు గల్ఫ్ కంట్రీస్ ఆంక్షలు విధించాయి. సదరు దేశానికి రవాణా, రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఖతార్లో ఉన్న భారతీయులు నానా యాతనలు పడుతున్నారరు. అసలు విమానానికి దిగడానికి ప్లేస్ లేక.. ఖతార్ ఉగ్రవాదులకు మద్దతిస్తుందనే సాకుతో అమెరికా తెంపరితనం చూపిస్తోంది. ఉన్నట్లుండి రవాణా సౌకర్యాలు కట్ చేయడంతో ఇండియన్స్ విమానాశ్రయాల్లో పడిగాలుపు పడుతున్నారు.

గల్ఫ్ దేశాల మధ్య అంతర్గత చిచ్చు.. మన దేశ ఎగుమతి, దిగుమతులపై ప్రభావం పడింది. సహజవాయువును దేశానికి దిగుమతి చేసుకుంటున్నామంటే.. అధి ఖతార్ ప్రోత్సాహమే. ఖతార్ మనకు మూడో అతిపెద్ద సరఫరాదారు. ఇక ఇండియా నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఖతార్ వెళతాయి. ఇఫ్పుడు సౌదీ సరిహద్దు క్లోజైంది కాబట్టి.. ఓడలు ఖతార్ వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటివరకూ ఎగుమతి, దిగుమతులపై ప్రభావం ఎక్కువగానే ఉండటం ఖాయం.

- Advertisment -
spot_img

Most Popular